బీహార్‌ను తిరిగి చీకటి యుగానికి తీసుకెళ్లేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు

by Dishanational1 |
బీహార్‌ను తిరిగి చీకటి యుగానికి తీసుకెళ్లేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్‌లోని ఆర్జేడీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. లాలూ-రబ్రీ ప్రభుత్వం హయాంలో బీహార్‌ను జంగిల్ రాజ్‌గా మార్చారాని విమర్శించారు. ఆదివారం బీహార్‌లోని కతిహార్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోడీ పేదల జీవితాల్లో భారీగా మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా కుటుంబ రాజకీయాలను నిర్మూలిచే పనిని మోడీ ప్రారంభించారు. అలాగే కులతత్వం, బుజ్జగింపులను తొలగించారు. ప్రతి పౌరుడి అభ్యున్నతికి కృషి చేశారు. అయితే, ఇప్పుడు లాలూ యాదవ్, కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ)కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. గతంలో లాలూ-రబ్రీ ప్రభుత్వం బీహార్‌ను జంగిల్ రాజ్‌గా మార్చిన సంగతి ప్రజలకు తెలుసు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీతో కలిసున్నారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన వారిని, కాకాసాహెబ్ కాలెల్కర్ కమిషన్ నివేదికను అణచివేసిందని, మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకించిందని లాలూకు గుర్తుచేద్దామని అనుకుంటున్నానని అమిత్ షా వెల్లడించారు. ఆర్జేడీ పేదలు, వెనుకబడిన వారు, ఓబీసీలు అందరినీ మోసం చేసింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నితీశ్ సీఎం అయ్యాక వారి దౌర్జన్యాలు ఆగిపోయాయి. నితీశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి విద్యుత్ అందించారు. కానీ, ఇండియా కూటమి మళ్లీ చీకటి యుగానికి తీసుకెళ్లి, ఓబీసీలను తొక్కేయాలనుకుంటోందని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోడీని తొలి ఓబీసీ ప్రధానమంత్రిని చేసింది బీజేపీయేనని అమిత్ షా పేర్కొన్నారు.



Next Story

Most Viewed