ప్రజాస్వామ్యాన్ని చులకన చేసేలా చట్టాలు.. కేంద్రంపై ఫైర్ అయిన ప్రియాంక

by Dishanational6 |
ప్రజాస్వామ్యాన్ని చులకన చేసేలా చట్టాలు.. కేంద్రంపై ఫైర్ అయిన ప్రియాంక
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంపై విరుచుకపడ్డారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. రైతుల నిరసనలు, ఆర్టికల్ 370 రద్దు సహా పలు అంశాల గురించి బీజేపీపై ఫైర్ అయ్యారు. కేరళలోని త్రిస్సూర్ లో జరిగిన ర్యాలీలో ప్రియాంక ప్రసంగించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను పట్టించుకోకుండా చట్టాలు రూపొందించారని మండిపడ్డారు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా చట్టాలు అమలు చేశారని ఫైర్ అయ్యారు. లక్షలాది మంది రైతులు నెలల తరబడి నిరసనలు చేశారని గుర్తుచేశారు. నిరసన చేసిన రైతుల్లో కొందరు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో కొందరిని తీవ్రవాదులని.. మరకొందర్ని దేశవ్యతిరేకులని పిలిచిని.. నిరసనను కొనసాగించారని అన్నారు.

మోడీ ప్రభుత్వం 2020లో సాగు చట్టాలను ప్రవేశపెట్టింది. వ్యవసాయ చట్టాల అమలుతో ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా, యూపీకి చెందిన రైతులు ఏడాది పాటు నిరసన కొనసాగించారు. ఇకపోతే 2021లో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

ఆర్టికల్ 370 రద్దుపై ప్రియాంక గాంధీ స్పందించారు. జమ్ముకశ్మీర్ ప్రజల గొంతుకలు ప్రభుత్వానికి వినబడట్లేదని అన్నారు. ఈ దేశంలో ఒక రాష్ట్రం మొత్తం నెలల తరబడి ఇంటర్నెట్, ఫోన్ సేవలు లేకుండా కొట్టుమిట్టాడుతోంది. లఢక్ లో ప్రజలు తమ హక్కుల కోసం వేలాది మంది నిరాహార దీక్షలు చేస్తున్నారుని మండిపడ్డారు.

కేరళలో మొత్తం 20 లోక్ సభ స్థానాలు ఉండగా.. ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇక, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే మరోసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షాలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రెండు సీట్లు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఒకటి, కేరళ కాంగ్రెస్ (ఎం) ఒక సీటు గెలుచుకున్నాయి. అలప్పుజాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఒక స్థానాన్ని గెలుచుకుంది.

Next Story

Most Viewed