రేపటి నుంచే శీతాకాల సమావేశాలు.. చర్చకు వచ్చే అంశాలివే!

by Disha Web Desk 13 |
రేపటి నుంచే శీతాకాల సమావేశాలు.. చర్చకు వచ్చే అంశాలివే!
X

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. మంగళవారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 30 పార్టీలకు చెందిన నేతలు రాబోయే సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను, సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. సమావేశం తర్వాత కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ.. దేశం ముందు నిరుద్యోగం, ధరల పెంపు వంటి సమస్యలున్నాయి. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది' అని పేర్కొన్నారు. భారత్-చైనా సంక్షోభంపై ప్రభుత్వం విపక్షాలకు సరైన సమాధానం ఇవ్వలేకపోయిందని విమర్శించారు. పార్లమెంట్ లో ఈ అంశంతో పాటు కశ్మీరీ పండిట్ల హత్యల పై కూడా చర్చకు పట్టుబడుతాని పేర్కొన్నారు. ధరల పెంపు, నిరుద్యోగం, కేంద్ర సంస్థ దుర్వినియోగం, రాష్ట్రాలకు ఆర్థిక నిధుల నిలిపివేతపై ప్రశ్నిస్తామని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ పేర్కొన్నారు. కేంద్రం విపక్షాలను సమస్యల ప్రాముఖ్యత ఆధారంగా చర్చకు అనుమతివ్వాలని అన్నారు.

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు..

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 29 వరకు 23 రోజుల పాటు 17 సిట్టింగుల్లో సమావేశాలు సాగనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ పేర్కొంది. తొలి రోజు ప్రారంభ సెషన్‌లో రెండు నెలల క్రితం మరణించిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌కు నివాళులు ఆర్పించనున్నారు. కాగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తొలిసారిగా రాజ్యసభ చైర్మెన్‌గా వ్యవహరించనున్నారు. కేంద్రం ఈ సమావేశాల్లో 16 కొత్త బిల్లులు ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉంది.

Next Story

Most Viewed