చెన్నైలో భారీగా హవాలా డబ్బు స్వాధీనం..

by Disha Web Desk 5 |
చెన్నైలో భారీగా హవాలా డబ్బు స్వాధీనం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: చెన్నై విమానాశ్రయంలో భారీగా హవాలా డబ్బును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైన్నై నుండి థాయ్ లాండ్ కు అక్రమంగా వీదేశీ కరెన్సీని తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని చెన్నైలోని అన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ బలగాలు అడ్డగించాయి. థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ కు టూరిస్టు వీసాపై వెళుతుండటంతో అనుమానించిన పోలీసులు అతన్ని విచారించారు. దాటవేసే సమాదానాలు చెబుతుండటంతో ఆ వ్యక్తి సూటుకేసును, లగేజీని సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేశారు. ఆ సూట్ కేసులో అమెరికా డాటర్లు, యూరోలు, సౌదీ రియాల్స్ సహా 3 కోట్లు విలువ చేసే వీదేశీ కరెన్సీ ఉండటంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ వ్యక్తి కేవలం కరెన్సీ క్యారియర్ మాత్రమేనని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడికి ఈ డబ్బు ఎవరు ఇచ్చారు? ఎందుకోసం తరలిస్తున్నారు అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed