హాయ్, ఇట్స్ మీ.. 15 బిలియన్ మైళ్ల దూరం నుంచి నాసా వాయేజర్ 1 స్పందన..!

by Dishanational6 |
హాయ్, ఇట్స్ మీ.. 15 బిలియన్ మైళ్ల దూరం నుంచి నాసా వాయేజర్ 1 స్పందన..!
X

దిశ, నేషనల్ బ్యూరో: 1977లో నాసా ప్రయోగించిన ‘వాయేజర్ 1’ అంతరిక్ష నౌక ప్రాణం పోసుకుంది. గత కొన్ని నెలల క్రితంగా ఆ స్పేస్ షిప్ జాడ తెలియకుండా పోయింది. కాగా.. ప్రస్తుతం ఆ స్పేస్ షిప్ నుంచి సమాచారం అందినట్లు ప్రకటించింది నాసా. స్పేస్ షిప్ కంట్రోలర్లు ఇప్పటికీ తమ ఆదేశాలు స్వీకరిస్తున్నప్పటికీ, నవంబర్ 14, 2023 నుంచి దాని నుంచి భూమికి సిగ్నల్స్ రావడం లేదని తెలిపారు నాసా సైంటిస్టులు.

ప్రస్తుతం యూనివర్స్ లో సుదూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువుగా వాయేజర్ 1 రికార్డు సృ‌ష్టించింది. 1977లో ప్రయోగించిన ఈ నౌక ప్రస్తుతం సౌరకుటుంబాన్ని దాటి ‘ ఇంటర్‌స్టెల్లార్’ మీడియంలోకి ప్రవేశించింది. ఇది భూమి నుంచి సుమారుగా 15 బిలియన్ మైళ్ల దూరంలో ఉంది. భూమి నుంచి పంపిన సందేశాలు వాయేజర్ 1కి చేరుకునేందుకు దాదాపు 22.5 గంటల సమయం పడుతుంది. అయితే, ఒక చిప్ పనిచేయకపోవడంతో వాయేజర్ 1లో సమస్య వచ్చినట్లు నాసా జెట్ ప్రొపల్షన్ బృందాలు కనిపెట్టాయి. అంతరిక్ష నౌకలోని 46 ఏళ్ల క్రితం నాటి కంప్యూటర్ కోడింగ్ ఈ సమస్యను పరిష్కరించింది. ప్రస్తుతం వాయేజర్ 1లోని ఆన్‌బోర్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ హెల్త్, దాని పొజిషన్ గురించి కీలక డేలాను తిరిగి ఇచ్చినట్లు నాసా వెల్లడించింది. ప్రస్తుతం వాయేజర్ 1.. డేటాను ఇవ్వడం తిరిగి ప్రారంభించింది.

దీని తర్వాత ప్రయోగించిన వాయేజర్ 2 నౌక కూడా 2018లో సౌర వ్యవస్థను దాటింది. వాయేజర్ స్పేస్ షిప్ లో ఏర్పాటు చేసిన రెండు ‘‘గోల్డెన్ రికార్డ్స్’’-బంగారు పూతపూసిన రాగి డిస్కుల్లో భూమికి సంబంధించిన సమాచారం ఉంది. గ్రహాంతవాసులకు మనుషుల వివరాలను తెలియజేసేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. 2025 తర్వాత స్పేస్ షిప్ లోని పవర్ బ్యాకప్ లు పనిచేయవు. ఆ తర్వాత భూమికి సందేశాలు ఇవ్వడం ఆగిపోతాయని భావిస్తున్నారు. ఇక ఇవి మన పాలపుంతలో నిశబ్దంగా ప్రయాణిస్తాయని తెలిపారు సైంటిస్టులు.



Next Story

Most Viewed