నెల రోజుల్లో మహారాష్ట్రకు కొత్త సీఎం.. మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్

by Dishafeatures2 |
నెల రోజుల్లో మహారాష్ట్రకు కొత్త సీఎం.. మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ప్రస్తుతం నడుస్తోన్న రాజకీయాలపై మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేతపృథ్వీరాజ్ చవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 11 నాటికి మహారాష్ట్రకు కొత్త సీఎం రానున్నారని అన్నారు. త్వరలో ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండేకు ఉద్వాసన ఖాయమని అన్నారు. అవసరమైతే షిండేను, ఆయన వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారని సంచలన ఆరోపణలు చేశారు. అదే జరిగితే ఆయన స్థానంలోకి అజిత్ పవార్ వస్తారని తెలిపారు.

షిండే కంటే కూడా అజిత్ పవార్ పైనే బీజేపీ ఎక్కువ విశ్వాసాన్ని కలిగిఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అనిశ్చితి ఉందని, ఇది రాష్ట్రానికి మంచిది కాదని ఆయన అన్నారు. కాగా అజిత్ పవార్ తిరుగుబాటుకు సంబంధించిన వ్యూహరచన మొత్తం ఢిల్లీలో జరిగినట్టు ఆయన తెలిపారు. బీజేపీ పెద్దలు చెప్పినట్టు అజిత్ పవార్ చేశారని పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు.



Next Story

Most Viewed