అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టెన్షన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ

by Disha Web Desk 17 |
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టెన్షన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ
X

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. దీంతో జాతీయ పార్టీగా గుర్తింపు కోసం ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించింది. జాతీయ హోదా లేకపోవడం ఎన్నికల్లో పోటీ చేయడానికి, తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు ఆటంకంగా మారుతోందని టెన్షన్ పడుతుంది. ఆప్ కర్ణాటక కన్వీనర్ పృథ్వీ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ పార్టీగా గురింపు పొందేందుకు కావాలసిన అన్ని అర్హతలు తమకున్నాయని అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) జాతీయ హోదా ఇచ్చేందుకు ఎందుకు తిరస్కరిస్తోందో తెలియడం లేదని ఆయన అన్నారు.

ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం సార్వత్రిక ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లను సాధించాలి. లోక్‌సభలో కనీసం నాలుగు సీట్లు గెలిస్తే ఆ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తారు. గత ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్‌లలో గెలవడంతో తమకు అన్ని అర్హతలు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.

‘నిబంధనల ప్రకారం ఆప్‌కు జాతీయ హోదా ఇవ్వొచ్చా లేదా అని పదో తరగతి పిల్లాడిని అడిగినా చెబుతాడు. మరి ఎన్నికల కమిషన్ ఎందుకు జాప్యం చేస్తోందో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఆప్‌కు జాతీయ హోదా ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను. ఎన్నికలప్పుడు జాతీయ పార్టీకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారో కర్ణాటక ఎన్నికలప్పుడు తమ పార్టీకి కూడా అవన్నీ కల్పించాలి’ అని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.



Next Story

Most Viewed