దేశంలో ప్రతిరోజూ ఆహారం దొరకని పిల్లల సంఖ్య 67 లక్షలు

by Dishanational1 |
దేశంలో ప్రతిరోజూ ఆహారం దొరకని పిల్లల సంఖ్య 67 లక్షలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని లక్షలాది మంది చిన్నారులు ఇప్పటికీ సరైన ఆహారం దొరక్క పస్తులుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలో 6 నుంచి 23 నెలల వయసు గల 67 లక్షల మంది పిల్లలు 24 గంటల పాటు ఆహారం అనేది లేకుండా జీవిస్తున్నారని ఓ అధ్యయనం తెలిపింది. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ది లాన్సెట్‌ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. తక్కువ, మధ్య-ఆదాయ దేశాల్లో 24 గంటల వ్యవధిలో 6 నుంచి 23 నెలల వయసు ఉన్న పిల్లలు జంతు పాలు కానీ, ఘన, మోస్తరు-ఘన ఆహారమేదీ లేకుండా బతికేస్తున్నారని పేర్కొన్నారు. సర్వేకు 24 గంటల ముందు దాదాపు 81 శాతం మంది పిల్లలు తల్లిపాలు కాకుండా కొంత ఆహారం తీసుకుంటున్నారు. తల్లిపాలు మాత్రమే తీసుకోగల శిశువులు కూడా అప్పుడప్పుడు ప్రొటీన్లు, శక్తి, విటమిన్లు, ఖనిజాలు అందించే ఆహారం తీసుకుంటున్నారని, సర్వేకు ముందు 24 గంటల సమయంలో తీసుకోలేదని పరిశోధకులు చెబుతున్నారు. అంటే, సాధారణ ఆహారం తీసుకోలేని, తల్లిపాలు మాత్రమే తీసుకోగల శిశువులకు ప్రతిరోజూ పూర్తిస్థాయిలో ఆహారం లభించడంలేదని అధ్యయనం పేర్కొంటోంది.



Next Story

Most Viewed