కేజ్రీవాల్ అరెస్టు.. నిశితంగా పరిశీలిస్తున్నామన్న అమెరికా

by Dishanational6 |
కేజ్రీవాల్ అరెస్టు.. నిశితంగా పరిశీలిస్తున్నామన్న అమెరికా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు విదేశాల్లో చర్చగా మారింది. ఇదివరకే కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. తాజాగా అమెరికా కూడా కేజ్రీవాల్ అరెస్టుపై ప్రకటన చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారాన్ని గమనిస్తున్నామని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ కేసులో పారదర్శక, న్యాయబద్ద, వేగవంతమైన విచారణ జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల శాఖకు సూచించినట్లు మీడియాతో చెప్పారు. మరోవైపు అమెరికా వ్యాఖ్యలపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

ఇకపోతే జర్మన్ పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన గురించి అమెరికా అధికార ప్రతినిధిని ప్రశ్నించింది మీడియా. భారత్- జర్మనీల మధ్య డిస్కషన్ గురించి జర్మనీ విదేశాంగ శాఖ సమాధానం చెప్తుందని దాటవేశారు.

కాగా, ముడుపులు తీసుకుని లిక్కర్‌ పాలసీ రూపొందించడంలో ప్రధాన పాత్ర అరవింద్‌ కేజ్రీవాల్‌దేనన్న ఆరోపణలపై ఈడీ కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. ఈనెల 21న కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. తర్వాత కోర్టులో హాజరుపరచగా.. ఈనెల 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. మరోవైపు తన అరెస్టు అక్రమం అని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై ఢిల్లీ కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.


Next Story