ఓటు వేయడానికి సిద్ధంగా 97 కోట్ల మంది: ఎన్నికల సంఘం

by Dishanational1 |
ఓటు వేయడానికి సిద్ధంగా 97 కోట్ల మంది: ఎన్నికల సంఘం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత ఎన్నికల సంఘం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోసం మొత్తం 96.88 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించింది. ఈ ఏడాది మేలో జరగనున్న ఎన్నికల కోసం కొత్తగా 2 కోట్ల మంది యువ ఓటర్లు(18-29 ఏళ్ల మధ్య వయస్సు గలవారు) జాబితాలో చేరారని తెలిపింది. ఇదివరకు 2019తో పోల్చితే కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగిందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1 నాటికి సార్వత్రిక ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, యూటీలకు సంబంధించి ఓటర్ల జాబితాను ఎన్నికలసంఘం రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం, మహిళా ఓటర్ల నమోదులో గణనీయమైన పెరుగుదల ఉందని, కొత్తగా 1.41 కోట్లకు పైగా మహిళా ఓటర్లు నమోదు చేసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. ఇది పురుషుల(1.22 కోట్లు) కంటే 15 శాతం ఎక్కువ. యువత కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు వీలుగా నియోజకవర్గ స్థాయిలో స్పెషల్ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల(ఏఈఆర్ఓ)ను నియమించినట్టు ఈసీ పేర్కొంది. ఇంటింటింటికి వెళ్లి సమగ్ర ధృవీకరణ చేపట్టి 1.65 కోట్ల ఓట్లను తొలగించారు. వారిలో కొందరు మరణించగా, శాశ్వతంగా బదిలీ అయినవారు, నకిలీ ఓటర్లు ఉన్నారు.



Next Story

Most Viewed