ED దూకుడు.. మరో సీఎం కూతురిపై మనీలాండరింగ్ కేసు

by Disha Web Desk 2 |
ED దూకుడు.. మరో సీఎం కూతురిపై మనీలాండరింగ్ కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించగా.. తాజాగా మరో సీఎం కూతురిని ఈడీ అధికారులు టార్గెట్ చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. అక్రమ చెల్లింపులకు సంబంధించి వీణ సహా మరికొందరిపై ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 2017-2020 మధ్య కొచ్చిన్ వినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ సంస్థ వీణకు రూ.1.72 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ డీల్‌లో అక్కడి అధికార పార్టీ సీపీఎం సహా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్(UDF) పక్షం నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. వీణకు ఎక్సాలాజిక్ అనే కంపెనీ ఉన్నది. దాంతో పాటు కొచ్చిలో పలు కంపెనీలు కూడా ఉన్నాయి. ఆదాయ‌ప‌న్ను శాఖ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఈడీ చ‌ర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.






Next Story

Most Viewed