డీఆర్‌డీవో స్వదేశీ సంకేతిక క్షిపణీ ప్రయోగం సక్సెస్

by Disha Web Desk 5 |
డీఆర్‌డీవో స్వదేశీ సంకేతిక క్షిపణీ ప్రయోగం సక్సెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలెప్ మెంట్ ఆర్గనైజేషన్ దేశీయ సాంకేతికతతో రూపొందిన క్షిపణీని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగాన్ని డీఆర్‌డీవో విజయవంతంగా నిర్వహించింది. ఇది స్వదేశీ ప్రొపల్షన్ సిస్టమ్ తో నడిచే లాంగ్ రేంజ్ సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఈ ప్రయోగం చేపట్టిన సరైన సమయంలో నిప్పులు చిమ్ముతూ గాల్లోకి ఎగిరి నిర్ధేశించిన సమయానికి క్షిపణి ప్రయోగం జరిగింది. ఈ పరీక్ష సమయంలో.. అన్ని సబ్‌సిస్టమ్‌లు ఆశించిన విధంగా పనిచేశాయి. రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, టెలిమెట్రీ వంటి పలు రేంజ్ సెన్సార్‌ల ద్వారా క్షిపణి పనితీరును డీఆర్‌డీవో అధికారులు పర్యవేక్షించారు. విమాన మార్గం యొక్క పూర్తి కవరేజీని నిర్ధారించడానికి ఐటీఆర్ వివిధ ప్రదేశాలలో మోహరించింది. క్షిపణి విమానాన్ని కూడా ఐఏఎఫ్ సూ-30-ఎమ్‌కే-ఐ ఎయిర్ క్రాఫ్ట్ పర్యవేక్షించింది.

Next Story

Most Viewed