మామ గెలుపు కోసం కోడలు ప్రచారం

by Disha Web Desk 15 |
మామ గెలుపు కోసం కోడలు ప్రచారం
X

దిశ, జగదేవ్ పూర్ : బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి. వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఆయన కోడలు శాలినిరెడ్డి బుధవారం జగదేవ్ పూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటికి తిరుగుతూ మహిళలను కలిసి కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, కావ్య దర్గయ్య, మాజీ సర్పంచ్ బాల్ లక్ష్మీ, నాయకులు నరసింహారెడ్డి, సుధాకర్ రెడ్డి, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed