లౌకికవాదంపై ప్రత్యక్ష దాడి చేస్తున్నారు: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

by Dishanational2 |
లౌకికవాదంపై ప్రత్యక్ష దాడి చేస్తున్నారు: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. సీఏఏ ద్వారా లౌకిక వాదంపై ప్రత్యక్ష దాడి చేస్తున్నారని విమర్శించారు. నార్త్ 24 పరగణాస్ జిల్లాలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సీఏఏతో ముందుకు వెళ్లాలనే బీజేపీ నిర్ణయం పూర్తిగా వైఫల్యంతో ముగుస్తుందని తెలిపారు. ‘మతం ఆధారంగా పౌరసత్వం గురించి మీరు ఎప్పుడూ వినలేదు? ఈ చర్య మానవత్వానికి అవమానం. అంతేగాక దేశ మౌలిక సూత్రాలకు విరుద్ధం’ అని అన్నారు. సీఏఏ అమలుతో ఉద్రిక్తతలను రేకెత్తించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీని ద్వారా దేశంలో అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఏఏ నిబంధనలపై అనేక అనుమానాలున్నాయన్నారు. ఎన్నార్సీ పేరుతోనూ 13 లక్షల మంది బెంగాలీలను మినహాయించారని, ఇది ప్రజల హక్కులను హరించివేసే కుట్ర అని అన్నారు.


Next Story