ఢిల్లీ లిక్కర్ కేసు: మరోసారి సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

by Disha Web Desk 2 |
ఢిల్లీ లిక్కర్ కేసు: మరోసారి సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు మరోసారి దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఇవాళ మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఇవాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసుల్లో కోరింది. కాగా, ఈ నెల 19న మెడిటేషన్ కోర్సు కోసం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని వీడే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయంలో ఈడీ సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలోనే నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని మొదటిసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. మరోవైపు ఈ కేసు విచారణపైనే ఈ ఏడాది ఏప్రిల్ 16న సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను తొమ్మిది గంటల పాటు విచారించారు. కాగా, ఆప్ లో ఇద్దరు అగ్రనేతలు లిక్కర్ స్కాం వ్యవహారంలో జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed