- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మూడు చట్టాలు మార్పు చేయాల్సి ఉంది: అమిత్ షా
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంగ్లేయుల కాలం నాటి 3 చట్టాలను మార్చాల్సి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. 175 మంది ట్రైనీ ఐపీఎస్‌లు ట్రైనింగ్ పూర్తిచేసున్న సందర్భంగా పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. సీఆర్‌పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉందని, మూడు చట్టాల్లో మార్పులు చేసి ప్రభుత్వం పార్లమెంట్ ముందు ఉంచిందని స్పష్టం చేశారు. త్వరలో నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతుందని, ప్రజల అధికారాలను సురక్షితంగా ఉంచడం కొత్త చట్టాల ఉద్దేశమన్నారు. కొత్త చట్టాల ఆధారంగా అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు.
75వ బ్యాచ్ ఐపీఎస్ శిక్షణలో 33 మంది మహిళా ఐపీఎస్ లు ఉండడం గర్వకారణం, సంతోషంగా ఉందన్నారు. దేశానికి సేవ అందించడంలో ఐపీఎస్ లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. పీడిత ప్రజల అభ్యున్నతి, వారి భద్రత కోసం ఐపీఎస్ లు నిబద్ధతతో కృషి చేయాలని చెప్పారు. వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సవాళ్లు విసురుతున్నాయని, సైబర్ నేరాల అదుపు, నేరగాళ్లకు చెక్ పెట్టడంలోనూ టెక్నాలజీ పై ఐపీఎస్ లు దృష్టి సారించాలని సూచించారు.
హవాలా, నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్టంగా పోరాడాలని, భవిష్యత్ లో ఎదురయ్యే ఎన్నో సవాళ్ళను ఐపీఎస్ లు అలవోకగా ఎదుర్కోవాలన్నారు. సైబర్ క్రైమ్, క్రిప్టో కరెన్సీ, హవాలా, నకిలీ నోట్ల, నార్కోటిక్స్, ఇంటర్ స్టేట్ గ్యాంగ్, చార్జిషీట్ ఫైల్, ఫోరెన్సిక్ సైన్స్ ఇలా అన్ని అంశాలపై ఐపీఎస్ లు పట్టు సాధించాలన్నారు. న్యాయ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా క్రిమినల్ జస్టిస్ పై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. ఈ 25 ఏళ్లు (అమృత్‌కాల్) మన తీర్మానాన్ని విజయవంతం చేయాలని, ప్రధాని మోదీ నేతృత్వంలో అన్ని రంగాల్లో దేశం ముందుకెళ్తోందని హర్షం వ్యక్తంచేశారు.