సీఏఏపై బంద్‌‌కు పిలుపునిస్తే పార్టీల గుర్తింపు రద్దు : సీఎం

by Dishanational4 |
సీఏఏపై బంద్‌‌కు పిలుపునిస్తే పార్టీల గుర్తింపు రద్దు : సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో : అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి బంద్‌లకు పిలుపునిచ్చే రాజకీయ పార్టీలు తమ రిజిస్ట్రేషన్లను కోల్పోతాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై వ్యతిరేకత ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని.. వీధుల్లో నిరసనలు తెలిపితే ప్రయోజనమేం ఉండదన్నారు. ‘‘నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఒక రాజకీయ పార్టీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అవకాశం కూడా ఉంటుందని మర్చిపోకూడదు’’ అని ఆయన కామెంట్ చేశారు. ‘‘అసోంలో విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వొచ్చు.. కానీ గతంలో గౌహతి హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశం కారణంగా రాజకీయ పార్టీలు బంద్‌‌లకు పిలుపును ఇవ్వలేవు’’ అని సీఎం హిమంత చెప్పారు. ‘‘సీఏఏ అమల్లోకి వచ్చాక రాజకీయ పార్టీలు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి నిరసనలకు దిగితే మేం ఊరుకోం. వాటికి వ్యతిరేకంగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.


Next Story