జ్ఞానవాపి మసీదును ముస్లింలు మాకు అప్పగించాలి : వీహెచ్‌పీ

by Dishanational4 |
జ్ఞానవాపి మసీదును ముస్లింలు మాకు అప్పగించాలి : వీహెచ్‌పీ
X

దిశ, నేషనల్ బ్యూరో : కాశీలోని జ్ఞానవాపి మసీదు స్థలంలో గతంలో పెద్ద ఆలయం ఉండేదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయం స్థలంలో ప్రస్తుతమున్న మసీదు నిర్మాణాన్ని హిందూ దేవాలయంగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఆ నిర్మాణాన్ని ముస్లిం పక్షం స్వచ్ఛందంగా ఆలయానికి అప్పగించాలని శనివారం వీహెచ్‌పీ కోరింది. జ్ఞానవాపి మసీదులోని వజూఖానా స్థలంలో బయటపడిన శివలింగానికి పూజలు చేసుకోవడానికి హిందువులను అనుమతించాలని డిమాండ్ చేసింది. ‘‘జ్ఞానవాపి మసీదు స్థలంలో గతంలో హిందూ దేవాలయం ఉండేదని ఏఎస్ఐ సర్వే రిపోర్టుతో తేలిపోయింది. ప్రార్థనా స్థలాల చట్టం- 1991లోని సెక్షన్ 4 ప్రకారం ఈ నిర్మాణాన్ని హిందూ దేవాలయంగా ప్రకటించాలి’’ అని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఓ ప్రకటనలో కోరారు. కాగా, ఈ కేసులో ముస్లిం పిటిషనర్ల వాదన మరోలా ఉంది. ఏఎస్‌ఐ రూపొందించిన సర్వే నివేదికే తుది తీర్పు కాదని ముస్లిం పక్షం అంటోంది.

Next Story

Most Viewed