- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీధి శునకాల సంరక్షణకు చికెన్ బిర్యానీ పథకం.. ఎక్కడంటే?
బెంగళూరులో వీధి శునకాల సంక్షేమం కోసం బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) కీలకమైన పథకాన్ని ప్రారంభించింది.

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులో (Bangalore) వీధి శునకాల (Street Dogs) సంక్షేమం కోసం బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) కీలకమైన పథకాన్ని ప్రారంభించింది. వీధికుక్కల ఆకలి తీర్చడానికి, వీటికి రోజూ మూడు పూటలా చికెన్ బిర్యానీ అందించేందుకు రూ.2.80 కోట్ల వ్యయంతో ఓ ప్రణాళిక రూపొందించింది. నగరంలో సుమారు 2.80 లక్షల వీధి శునకాలు ఉన్నాయని అంచనా. ప్రథమ దశలో 5,000 కుక్కలకు ఈ ఆహారాన్ని అందించనున్నారు. ఒక్కో కుక్కకు రోజుకు సగటున 367 గ్రాముల చికెన్ బిర్యానీ ఇవ్వనున్నారు.
ఈ పథకాన్ని అమలు చేయడానికి BBMP ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. అధికారికంగా గుర్తించిన 125 ప్రాంతాల్లో వీధికుక్కలకు ఈ ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో అనేక హోటళ్లతో ఒప్పందాలు కుదుర్చుకొని, ప్రతిరోజూ వేడివేడి బిర్యానీని సరఫరా చేయనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బృందాలు ఈ ఆహారాన్ని సరఫరా చేసి, శునకాల ఆరోగ్యంపై కూడా పర్యవేక్షణ చేస్తాయి.
ఇప్పటికే BBMP వీధికుక్కలకు నీరు, ఆహారం, నివాస ఏర్పాట్లను కల్పిస్తూ చర్యలు తీసుకుంటోంది. వాటి జనాభా నియంత్రణకు శస్త్రచికిత్సలు, టీకాలు వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇకపోతే, తాజా చికెన్ బిర్యానీ పథకం వీధికుక్కల పోషణను మరింత మెరుగుపరచడంతో పాటు, మానవులపై దాడుల సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.






