Central Election Commission: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు షాకిచ్చిన ఈసీ.. కొత్త నిబంధనలు అమల్లోకి

by Disha Web Desk 1 |
Central Election Commission: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు షాకిచ్చిన ఈసీ.. కొత్త నిబంధనలు అమల్లోకి
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థల పేర్లను ఇప్పటికే ప్రకటించాయి. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారం పర్వం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల కమీషన్ అన్ని పార్టీలకు షాకిచ్చింది. ఎలెక్షన్ కోసం ప్రచారం నిర్వహించే అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని కొత్త నిబంధనను తీసుకొచ్చింది. అందుకు సంబంధించి సువిధ అనే కొత్త యాప్2ను అమల్లోకి తీసుకొచ్చింది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థులైనా ప్రచారాలకు సంబంధించి 48 గంటల ముందు సువిధ అనే యాప్‎లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అలా దరఖాస్తు చేసుకుంటేనే 24 గంటల్లోపు అందుకు పర్మీషన్ లభిస్తుందని అధికారులు తెలిపారు. కాగా, మీటింగ్స్, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక ఎలక్షన్ ఆఫీస్, లౌడ్ స్పీకర్, హెలికాప్టర్, హెలిప్యాడ్, ఇంటింటి ప్రచారం, డిస్ ప్లే బ్యానర్లు, జెండాలు, ఎయిర్ బెలూన్స్, హోర్డింగులు, బ్యానర్లు, వీడియో వ్యాన్ మొదలైన అనుమతులు పొందేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా సువిధ పోర్టల్‎లో దరఖాస్తు చేసుకునేలా ఇచ్చే ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. అలాగే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల వద్దనే అనుమతి తీసుకునేందుకు వీలుగా కూడా సువిధ కౌంటర్‎ను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఈసీ పేర్కొంది.

Next Story

Most Viewed