- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
పక్కా ప్లాన్‌తోనే మావోయిస్టుల దాడి.. దంతెవాడ ఘటనలో కీలక విషయాలు
రాయ్‌పూర్: శక్తివంతమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లొజివ్ డివైస్‌ను (ఐఈడీ) తీవ్రవాదులు రెండు నెలల క్రితమే అమర్చారని ఛత్తీస్‌గఢ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. దంతెవాడలో జరిగిన బాంబు పేలుడులో డ్రైవర్‌తో సహా 11 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఈ దాడికి ఒక రోజు ముందు నిర్వహించిన మందుపాతర నిర్మూలన సమయంలో ఈ పేలుడు పదార్థం డిటెక్ట్ కాలేదని పోలీసులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం దంతెవాడలోని అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా సిబ్బందిని తీసుకెళుతున్న వాహనం బాంబు పేలుడుకు గురికావడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ)కి చెందిన పదకొండు మంది అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ఘటన అరన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు ఒక కిలోమీటర్ దూరంలో జరిగింది. ‘ఈ ఐఈడీ రెండు నెలల క్రితం లేదా అంతకంటే ముందే అమర్చారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పేలుడు పదార్థానికి అనుసంధానించిన తీగను కప్పిన మట్టి పొరపై గడ్డి పెరిగింది’ అని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ-బస్తర్ పరిధి) సుందర్ రాజ్ చెప్పారు. రోడ్డు పక్కన 3 నుంచి 4 అడుగుల మేర గొయ్యి తవ్వి 40 నుంచి 50 కిలోల పేలుడు పదార్థాన్ని ఉంచారని ఆయన తెలిపారు.
ఈ దాడికి 200 మీటర్ల దూరంలో స్థానిక గిరిజనులు ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా బీజ్ పండుమ్ పండుగ కోసం బాటసారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీళ్లు పోలీసులను గానీ, భద్రతా సిబ్బందిని గానీ డబ్బులు అడగారు. కానీ వాళ్లే గిరిజనుల చేతిలో ఎంతోకొంత పెడుతుంటారు. అయితే పోలీసు సిబ్బందిపై రెక్కి నిర్వహించేందుకు ఎవరైనా మిలీషియా సభ్యుడు అక్కడ ఉండి మావోలకు సమాచారం ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నట్లు ఐజీ చెప్పారు.