కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ అనుబంధ సంస్థ బీఎమ్ఎస్ సంచలన నిర్ణయం

by Disha Web Desk 17 |
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ అనుబంధ సంస్థ బీఎమ్ఎస్ సంచలన నిర్ణయం
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, కార్పోరేటీకరించడానికి వ్యతిరేకంగా భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎమ్ఎస్) భారీ ర్యాలీ నిర్వహించనుంది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రభుత్వరంగ సంస్థల్లోని బీఎమ్ఎస్‌ శాఖలన్నీ గురువారం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. బీఎమ్ఎస్ పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ పతాక కింద నవంబర్ 17న ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలనే లక్ష్యంతో ఈ ర్యాలీని నిర్వహించనున్నట్లు బీఎమ్ఎస్ ప్రకటన పేర్కొంది. కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరించాలని, శాశ్వత కార్మికులను నియమించాలని, వేతన ప్రయోజనాలను కల్పించాలని,శాశ్వత కార్మికులతో సమానంగా ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతను కల్పించాలనే డిమాండ్లతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణపై పౌర సమాజం లోని నాయకులు, దేశీయ ఆర్థిక వేత్తలు, క్షేత్రస్థాయి కార్యకర్తలతో కేంద్ర ప్రభుత్వం కూలంకషంగా చర్చించాలని, టెక్స్ట్ బుక్ మేధావులు, ఏసీ రూముల్లో ఉండే యాక్టవిస్టుల అభిప్రాయాలు తీసుకోవద్దని బీఎమ్ఎస్ సూచించింది. బీజేపీ అనుబంధ సంస్థల్లో కీలకమైన బీఎమ్ఎస్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ పై ర్యాలీని తలపెట్టడం సంచలనం కలిగిస్తోంది.

Next Story