ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ అబద్ధాలు చెబుతుంది: అసదుద్దీన్ ఒవైసీ

by Disha Web Desk 12 |
ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ అబద్ధాలు చెబుతుంది: అసదుద్దీన్ ఒవైసీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని తాము అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తామని వాగ్దానం చేస్తుంది. కాగా రిజర్వేషన్లపై బీజేపీ ఆరోపణలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లపై బీజేపీ అబద్ధాలు చెబుతుంది అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు తమ మతం ఆధారంగా కాకుండా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన నేపథ్యంలో రిజర్వేషన్లు పొందుతున్నారని వెనుకబడిన ముస్లింల కోసం రూపొందించబడిన జాబితా ప్రకారమే రిజర్వేషన్ పొందుతున్నారని ఒవైసీ చెప్పుకొచ్చారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story