బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీం షాక్

by Dishanational1 |
బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీం షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: బిల్కిస్ బానో కేసులో దోషులకు భారత అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. లొంగిపోవడానికి మరింత సమయం కావాలని కోరుతూ 11 మంది దోషులు దాఖలు చేసిన పిటిషన్‌లను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లలో న్యాయంలేదని అభిప్రాయపడింది. దోషులు ఆదివారం కల్లా జైలులో లొంగిపోవాలని ఆదేశించింది. బిల్కిస్ బానో కేసులో లొంగిపోయేందుకు నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ దోషులు పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం వీటి విచారణకు అర్హత లేదని స్పష్టం చేసింది. దోషులలో ఒకరైన గోవింద్‌భాయ్ తన 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యత కోసం, మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా తన కుమారుడి పెళ్లికి ఆరు వారాల పొడిగింపును కోరగా, మూడవ దోషి మితేష్ చమన్‌లాల్ భట్ సైతం పంటకోత పేరుతో ఆరు వారాల పొడిగింపును కోరాడు. 2022లో గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్‌లో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. అదే సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాలపడ్డారు. ఈ కేసులో 11 మంది దోషులుగా తేలడంతో వారికి జీవిత ఖైదు పడింది. 2022లో గుజరాత్ ప్రభుత్వం వీరికి ముందస్తుగానే విడుదల చేసింది. కానీ, ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది.

Next Story

Most Viewed