ఢిల్లీ: హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్

by Disha Web Desk 2 |
ఢిల్లీ: హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇటీవల తొమ్మిదోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటీసుల్లో ఇవాళ విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. అనూహ్యంగా ఆయన తొమ్మిదో సారి కూడా గైర్హాజరు అయ్యారు.

ఈ క్రమంలోనే లిక్కర్ కేసులో ఇవాళ తనను ఈడీ కచ్చితంగా అరెస్ట్ చేస్తుందన్న అనుమానాలతో ఈ ఉదయం ఢిల్లీ హైకోర్టులో హడావుడిగా పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ విచారణకు సిద్ధమని.. అరెస్ట్ కాకుండా తనకు రక్షణ కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో ఆయన అరెస్ట్ కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.


Next Story