భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ?

by Dishafeatures2 |
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ?
X

దిశ, వెబ్ డెస్క్: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు డ్ ప్లస్ కేటాగిరీ సెక్యూరిటీ కల్పించాలని ఆయన అనుచరులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. పలు దళిత సంఘాలతో పాటు ఆర్ఎల్డీ, ఎస్పీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ కు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆజాద్ కు జడ్ ప్లస్ కేటాగిరీ భద్రతా కల్పించాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ ఆజాద్ పై జరిగిన కాల్పుల ఘటనపై సీబీఐచేత విచారణ జరిపించాలని కోరారు.

ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని వారు మండిపడ్డారు. కాగా జూన్ 28న ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లాలో భీమ్ ఆర్మీ సహ వ్యవస్థాపకుడు, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.



Next Story

Most Viewed