కేంద్ర సంస్థలపై కేసు నమోదు చేస్తా.. అరవింద్ కేజ్రివాల్ ట్వీట్

by Disha Web Desk 13 |
కేంద్ర సంస్థలపై కేసు నమోదు చేస్తా.. అరవింద్ కేజ్రివాల్ ట్వీట్
X

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాంలో అవినీతి ఆరోపణలతో సీబీఐ సమన్ల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తీవ్రంగా స్పందించారు. కేంద్ర సంస్థల తీరుపై ఫిర్యాదు చేయనున్నట్లు శనివారం ట్వీట్ చేశారు. కోర్టుల్లో తప్పుడు ఆధారాలు సమర్పిస్తున్న సీబీఐ, ఈడీ అధికారులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. ఒకవేళ కోర్టు మిమ్మల్ని దోషిగా తేలిస్తే న్యాయస్థానానికి వ్యతిరేకంగా కేసు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. న్యాయం తన పని తాను చేసుకుపోతుందని, దానిపట్ల విశ్వాసం ఉంచాలని చెప్పారు.

మరోవైపు కేజ్రివాల్‌కు సీబీఐ సమన్ల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక పిలుపునిచ్చింది. సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించినున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటేరియట్ శనివారం ప్రకటన జారీ చేశారు. ‘ప్రస్తుతం జరగుతున్న అంశాలపై చర్చించేందుకు గానూ సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం’ అని ప్రకటనలో తెలిపారు. తాజాగా ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య విద్యుత్ సబ్సిడీపై వివాదం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Next Story

Most Viewed