కరెన్సీ నోట్లపై పెన్నుతో రాస్తే చెల్లుతాయా..? చెల్లవా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!

by Disha Web Desk 7 |
కరెన్సీ నోట్లపై పెన్నుతో రాస్తే చెల్లుతాయా..? చెల్లవా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
X

దిశ, వెబ్‌డెస్క్: కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించి సర్క్యులేట్ చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. బ్యాంకుల నుంచి వచ్చేటప్పుడు నోట్లు చాలా కొత్తగా ఉంటాయి. కానీ.. కాలక్రమేనా ఆ నోట్లు రూపు కోల్పోతాయి. ప్రజల చేతులో పడి నలిగిపోతాయి. కొంత మంది అయితే నోట్లపై ఏదో ఒకటి రాస్తుంటారు. పిచ్చి పిచ్చి గీతాలు గీస్తుంటారు. డబ్బులు లెక్కించి ఆ సంఖ్య నోట్లపై వేయడం.. ఖాళీ సమయంలో ఏవో పిచ్చి బొమ్మలు గీయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి నోట్లు ఏదో సందర్భంలో ప్రతి ఒక్కరి చేతికి వచ్చే ఉంటాయి. అయితే.. చాలా మందికి పెన్ను గీతాలు పెట్టిన నోట్లు చెల్లుతాయా లేదా అనే సందేహం కలుగుతోంది.

అయితే గతంలో రూ.2000 నోట్లు, రూ.500 నోట్లు కొత్తగా వచ్చినప్పుడు పెన్నుగీతలు ఉన్న నోట్లు చెల్లవు జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో వార్తలు గట్టిగానే వైరల్ అయ్యాయి. దీంతో.. పెన్ను గీతాలు ఉన్న నోట్లు చెల్లుతాయా లేదా అనే అనుమానం అందరిలో మరింత పెరిగింది. అసలు నోట్లపై పెన్ను గీతలు రాస్తే నిజంగానే అవి చెల్లవా.. ఇందులో వాస్తవం ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలాంటి ఫేక్ వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా క్లారిటీ ఇచ్చేసింది. కరెన్సీ నోట్లపై పెన్ను గీతలు, రాతలు ఉన్నా అవి చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. బ్యాంకులైనా, దుకాణాదారులైనా వీటిని నిరాకరించడం కుదరదని వెల్లడించింది. అయితే.. గతంలో ఆర్‌బీఐ చేసిన పోస్ట్ ‘నోట్లపై రాయడం వల్ల అవి తమ జీవితకాలన్ని కోల్పోతాయి. తొందరగా పాడవుతాయి. అప్పుడు ఆర్‌బీఐ మళ్లీ కొత్త నోట్లు ప్రింట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అలా చేయోద్దు అంటూ ప్రజలకు అభ్యర్థించింది’. అంతే కానీ.. పెన్ను గీతలు ఉన్న నోట్లు చెల్లవని కాదు. అయితే RBI Fact Check ఈ నోట్ గతంలో షేర్ చేసింది. ఇక మళ్లీ నోట్లు చెల్లుతాయా లేదా వార్తలు వస్తున్న క్రమంలోనే ఈ పోస్ట్ మరోసారి వైరల్ అవుతోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story