అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు బెదిరింపు మేసేజ్

by S Gopi |
అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు బెదిరింపు మేసేజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ ఇండిపెండెంట్ ఎంపీ, నటి నవనీత్ రాణాకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మేసేజ్‌లు వచ్చాయి. ఆమెను చంపేస్తామని వాట్సాప్‌లో ఆడియో పంపించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నవనీత్ రాణాకు వచ్చిన బెదిరింపు మేసేజ్‌లో ఆమెను అసభ్యకరమైన మాటలతో దూషించారని ఆమె వ్యక్తిగత సలహాదారుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆడియో నవనీత్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లపైనా అభ్యంతరకరంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో ఎంపీ నవనీత్ రాణా పీఏ ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్‌ల కింద పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story