68లో 23 కొత్తముఖాలే.. హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు

by Disha Web Desk 17 |
68లో 23 కొత్తముఖాలే.. హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు
X

షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 68 సీట్లలో 23 మంది ఎమ్మెల్యేలు తొలిసారే ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 14 మంది, బీజేపీ నుంచి 8, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఆసక్తికరంగా 68 మంది ఎమ్మెల్యేలలో ఒకే ఒక మహిళ ఎమ్మెల్యే ఉండటం గమనార్హం. అదే సమయంలో 8 మంది జైరాం ఠాకూర్ మంత్రులు ఓటమి పాలయ్యారు. వీరిలో సుమారు 15 మంది వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 2 వేల లోపే మెజారిటీ ఉంది. ఇక గురువారం వెలువడిన ఫలితాల్లో 68 స్థానాల్లో కాంగ్రెస్ 40 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 25, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు.

గుజరాత్‌లో 105 ఎమ్మెల్యేలు తొలిసారే..

మరోవైపు గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో 105 మంది గెలిచారు. 77 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. గెలిచిన వారిలో 14 మంది మహిళలు ఉన్నారు.


Next Story

Most Viewed