పోఖ్రాన్ ఎడారిలో 120 విమానాలు, ఎన్నెన్నో డ్రోన్లు, మిస్సైళ్లు.. ఏం జరిగింది ?

by Dishanational4 |
పోఖ్రాన్ ఎడారిలో 120 విమానాలు, ఎన్నెన్నో డ్రోన్లు, మిస్సైళ్లు.. ఏం జరిగింది ?
X

దిశ, నేషనల్ బ్యూరో : గగన సీమలో భారత వాయుసేన సత్తా చాటింది. మిస్సైళ్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలు, ఫైటర్ హెలికాప్టర్లను వినియోగించి ప్రపంచానికి తన సైనిక బలాన్ని మరోసారి చూపించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారి వేదికగా శనివారం జరిగిన ‘వాయు శక్తి’ సైనిక అభ్యాసం భారత సైన్యం బలాన్ని ప్రదర్శించింది. ఈ విన్యాసాల్లో 120కిపైగా విమానాలు పాల్గొనడం విశేషం. ‘ఆకాశం నుంచి మెరుపుదాడి’ థీమ్‌తో ఈ సైనిక అభ్యాసాన్ని నిర్వహించారు. రాఫెల్, సుఖోయ్-30 ఎంకేఐ, మిగ్-29, మిరాజ్-2000, తేజస్, హాక్‌ సహా వివిధ యుద్ధ విమానాలు పోఖ్రాన్‌ ఎడారిలో ఆర్టిఫీషియల్‌గా ఏర్పాటుచేసిన శత్రు లక్ష్యాలను సక్సెస్ ఫుల్‌గా ధ్వంసం చేశాయి. స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థలు, ఆకాష్, సమర్‌లను కూడా ఈసందర్భంగా ప్రదర్శించారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ ఈ విన్యాసాలను వీక్షించారు.


Next Story