మరోసారి కోర్టుని ఆశ్రయించిన కేజ్రీవాల్..!

by Dishanational6 |
మరోసారి కోర్టుని ఆశ్రయించిన కేజ్రీవాల్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి కోర్టుని ఆశ్రయించారు. తనకు షుగర్ లెవల్స్ పెరుగుతున్న కారణంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ఇవాళే విచారణ జరగనుంది. ఇకపోతే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి.. తీహార్ జైళ్లో ఉన్నారు కేజ్రీవాల్. జైళ్ల తనకు షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని.. దీంతో ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వాలని కోర్టుని కోరారు కేజ్రీవాల్. పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది.

కాగా, డయబెటిస్ తో బాధపుతున్న కేజ్రీవాల్.. తన పర్సనల్ డాక్టర్ ని కలిసేందుకు అనుమతించాలని ఢిల్లీ కోర్టుని ఆశ్రయించారు. దీనిపైన గురువారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా కేజ్రీవాల్ పై ఈడీ పలు ఆరోపణలు చేసింది. ఇంటి భోజనానికి కేజ్రీవాల్ కు అనుమతి ఉందని.. దీంతో మామిడి పండ్లు, ఆలూ పూరి తిని షుగర్ లెవల్స్ పెంచుకుంటున్నారని ఆరోపించింది. షుగర్ లెవల్స్ పెంచుకుని అనారోగ్యం కారణంగా బెయిల్ పొందాలని చూస్తున్నట్లు ఈడీ మండిపడింది.ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది ఖండించారు. దీంతో, కేజ్రీవాల్ తీసుకోవాల్సిన డైట్ వివరాలతో పాటు.. తీహార్ జైళ్లో ఇస్తున్న ఆహారవివరాలు అందించాలని అధికారులను ఆదేశించింది.

Next Story

Most Viewed