హిజాబ్ ధరించాలని హిందూ విద్యార్థినులపై ఒత్తిడి చేసిన పాఠశాల

by Disha Web Desk 9 |
హిజాబ్ ధరించాలని హిందూ విద్యార్థినులపై ఒత్తిడి చేసిన పాఠశాల
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూ బాలికలను బలవంతంగా హిజాబ్ ధరించాలని ఒత్తిడి తీసుకొచ్చిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌కు 25 కిలోమీటర్ల రూరంలో ఉన్న దామెహ్ జిల్లాలోని గంగా జమునా అనే పాఠశాలలో చదువుతున్న 6వ తరగతి, 8వ తరగతి(ఇద్దరు బాలికలు, ఒక బాలుడు) హిందూ విద్యార్థులను నుదిటపై ఉన్న తిలకాన్ని, తమ మణికట్టుపై ఉన్న పవిత్ర దారాన్ని తొలగించమన్నారని విద్యార్థులు తెలిపారు. స్కూల్‌కు వచ్చేటప్పుడు తప్పకుండా హిజాబ్ ధరించాలని చాలా ఒత్తిడి చేశారని వెల్లడించారు. ఉదయం ప్రార్థనల సమయంలో అల్లామా ఇక్బాల్ కవిత ‘‘లబ్ పే ఆతి హై దువా బంకే తమన్నా’’ ను కూడా వాళ్లు పాటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఈ స్కూల్‌పై గత కొంత కాలంగా ఆరోపణలు వస్తుండడంతో ఈ వివాదంపై నిజనిజాల్ని తేల్చేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. కొంతమంది స్టూడెంట్స్ నుంచి ఎవిడెన్స్ తీసుకుని.. ఈ ప్రభుత్వ- ఎయిడెడ్ మైనారిటీ పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులపై కొత్వాలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిపై బుధవారం భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 295, 506, అలాగే జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టంలోని నిబంధనల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తు జరుగుతున్న క్రమంలో నిందితులపై మరిన్ని సెక్షన్‌లు విధించే అవకాశం ఉందని దామోహ్ ఎస్పీ రాకేష్ సింగ్ వెల్లడించారు.

Next Story

Most Viewed