60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ

by Disha Web Desk 13 |
60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ
X

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్యోగ భర్తీపై ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంజూరైన 60 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. గత మూడు దశాబ్దాల ఇదే అత్యధికమని చెప్పారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. 'కోట్ల మంది యువత నియామకాలు లేక నిరాశ, నిస్పృహాలకు లోనవుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 60 లక్షల మంజూరైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి' అని అన్నారు. మంజూరైన ఈ పోస్టుల కోసం బడ్జెట్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించిన గాంధీ, దాని గురించి తెలుసుకోవడం యువత హక్కు అని అన్నారు. గత కొన్ని నెలలుగా పలు అంశాల్లో వరుణ్ గాంధీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed