జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో 55 దేవతా విగ్రహాలు

by Dishanational1 |
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో 55 దేవతా విగ్రహాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కింద పురాతన హిందూ ఆలయ అవశేషాలున్నాయన్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) నివేదికలో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో 55 హిందూ దేవుళ్ల విగ్రహాలను కనుగొన్నట్టు ఏఎస్ఐ పేర్కొంది. జ్ఞానవాపి మసీదు గోడతో పాటు వివిధ ప్రదేశాల్లో 15 శివలింగాలు, మూడు విష్ణు శిల్పాలు, మూడు గణేశుడు, రెండు నంది, రెండు కృష్ణ, ఐదు హనుమాన్ విగ్రహాలు, వివిధ కాలాలకు చెందిన 93 నాణెలను గుర్తించారు. 55 రాతి శిల్పాలతో పాటు 21 గృహోపకరణాలు, ఐదు చెక్కబడిన శ్లాబ్‌లు, 176 వాస్తుశిల్పాలు కలిపి మొత్తం 259 వస్తువులను కొనుగొన్నారు. 17వ శతాబ్దంలో ఔరంగజేబు ఆదివిశ్వేశ్వర ఆలయాన్ని కూల్చేసినట్లు నివేదికలోని ఆధారాలు బలంగా స్పష్టం చేస్తున్నాయి. ఏఎస్ఐ సర్వేలో ఒక మకర రాతి శిల్పం, ఒక ద్వారపాల, ఒక వోటివ్ మందిరం, 14 శకలాలు, ఏడు ఇతర రాతి శిల్పాలు కూడా ఉన్నట్టు తేలింది. వాటిలో 40 ఈస్ట్ ఇండియా కంపెనీ, 21 విక్టోరియా క్వీన్, మూడు షా ఆలమ్ బాద్‌షా-2 నాణెలు ఉండటం గమనార్హం. కృష్ణుడి విగ్రహం ఇసుక రాయితో నిర్మించారని, ఇది మధ్యయుగ కాలం నాటిదని నివేదిక వివరించింది.



Next Story

Most Viewed