శివకాశిలో 40 శాతం తగ్గిన టపాసుల ఉత్పత్తి

by Disha Web Desk 21 |
శివకాశిలో 40 శాతం తగ్గిన టపాసుల ఉత్పత్తి
X

చెన్నై: దేశంలో టపాసుల తయారీకి అడ్డాగా ఉన్న తమిళనాడు శివకాశి క్రాకర్స్ తయారీ హబ్‌లో ఉత్పత్తి తగ్గింది.తమిళనాడులోని విరుధునగర్ మతాబుల తయారీకి కీలకంగా ఉంది. దీపావళికి దేశవ్యాప్తంగా దాదాపుగా ఇక్కడి నుంచే సరఫరా అవుతాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితుల నేపథ్యంలో కోర్టు నిషేధాజ్ఞలు ఈ ఉత్పత్తిపై ప్రభావం చూపింది. కొన్ని ఏళ్ల వరకు రూ.6వేల కోట్లకు పైగా వ్యాపారం చోటుచేసుకోగా, గ్రీన్ కాకర్ల వినియోగించాలన్న నిబంధనలతో పూర్తిగా లెక్కలు మారాయి.

టపాసుల్లో వాడే బేరియంకు ప్రత్నామ్నాయంగా ఉపయోగించే రసాయనాల ఖర్చు పెరగడం కూడా ఓ కారణమని ఫైర్ వర్క్స్ యజమానులు తెలిపారు. ముఖ్యంగా స్ట్రోన్టియమ్ నైట్రేట్ రసాయనం భారత్‌లో లభ్యమవదని, దిగుమతి చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న ప్రయాస అని చెప్పారు. కాగా మరోవైపు సుప్రీంకోర్టుకు కాలుష్య నియంత్రణలో మార్గదర్శిగా ఉన్న జాతీయ పర్యావరణ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్ఈఈఆర్ఐ) క్రాకర్స్‌లో బేరియంకు ప్రత్నామ్నాయం ఉపయోగించాలని ప్రతిపాదించింది. ఇది పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.


Next Story