రాజ్యసభ ఎంపీల మొత్తం ఆస్తులు ఎంతంటే..!

by Dishanational1 |
రాజ్యసభ ఎంపీల మొత్తం ఆస్తులు ఎంతంటే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల్లో 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఎన్నికల సంఘం ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. మొత్తం 225 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా, వారిలో 75 మందిపై క్రిమినల్ కేసుల్ ఉన్నాయి. 40 మంది అంటే 18 శాతం మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, ఇద్దరు ఎంపీలపై హత్య, నలుగురు ఎంపీలపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఇక మొత్తం సభ్యుల ఆస్తుల విలువ రూ. 19,602 కోట్లని నివేదిక తెలిపింది. వారిలో 31 మంది అంటే 14 శాతం మంది బిలియనీర్లు ఉన్నారు.

నివేదిక ప్రకారం, క్రిమినల్ కేసులు ఉన్నవారిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సభ్యులే ఎక్కువ ఉన్నారు. 90 మంది రాజ్యసభ సభ్యుల్లో 23 శాతం మంది బీజేపీ సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్‌కు చెందిన 28 మంది ఎంపీల్లో 50 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. టీఎంసీకి చెందిన 13 మంది రాజ్యసభ సభ్యులలో ఐదుగురు (38 శాతం), ఆర్జేడీ నుంచి ఆరుగురిలో నలుగురు (67 శాతం), సీపీఐ(ఎం) నుంచి ఐదుగురు ఎంపీల్లో నలుగురు (80 శాతం), ఆప్‌కి చెందిన 10 మంది ఎంపీలలో 30 శాతం మంది, వైఎస్సార్‌సీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులలో నలుగురు (36 శాతం), డీఎంకేకు చెందిన 10 మంది ఎంపీల్లో ఇద్దరు (20 శాతం) తమపై క్రిమినల్ కేసులున్నట్లు తమ అఫిడవిట్‌లలో ప్రకటించుకున్నారు.

ఎంపీల ఆస్తులు..

నేరాలతో పాటు రాజ్యసభ సభ్యుల ఆస్తులపై కూడా నివేదిక వివరాలు పొందుపరిచింది. ఒక్కో ఎంపీకీ సగటున రూ. 87.12 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ప్రధాన పార్టీలలో, 90 మంది రాజ్యసభ సభ్యులలో 9 మంది బీజేపీ, కాంగ్రెస్‌లో 4, వైఎస్సార్‌సీపీకి చెందిన 5, ఆప్‌కి చెందిన ఇద్దరు, టీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు, ఇద్దరు ఆర్జేడీ సభ్యులు రూ. 100 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. కీలక పార్టీలకు సంబంధించి.. బీజేపీ ఎంపీల మొత్తం ఆస్తులు రూ. 3,360 కోట్లు ఉండగా, కాంగ్రెస్ రూ. 1,139 కోట్లు, వైఎస్ఆర్సీపీ రూ. 3,934 కోట్లు, బీఆర్ఎస్ రూ. 5,534 కోట్లు, ఆప్ ఎంపాల ఆస్తులు రూ. 1,148 కోట్లుగా ఉన్నాయి.



Next Story

Most Viewed