- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
జమ్ము ఎన్‌కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
by Disha Web |

X
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు మరోసారి ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అనంత్ నాగ్‌లో శనివారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు తెలిపారు. వీరికి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. వీరిద్దరికి గతంలో పలు ఉగ్ర నేరాల్లోనూ ప్రమేయం ఉన్నట్లు ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిని అనంత్ నాగ్‌కు చెందిన ఇష్ఫాక్ అహ్ గనీ, అవంతీపురకు చెందిన యవర్ అయుబ్ దర్‌గా గుర్తించారు. అయితే ఘటన స్థలంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసు, భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టారు.
Next Story