ఇద్దరి పైనుంచి దూసుకెళ్లిన ట్రైన్.. ఏమైందంటే..

by Dishanational4 |
ఇద్దరి పైనుంచి దూసుకెళ్లిన ట్రైన్.. ఏమైందంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్‌లోని జాంతారా జిల్లా కల్జారియా వద్ద రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం సాయంత్రం రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై నుంచి లోకల్ ట్రైన్ దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే దారుణ స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరగడానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందు.. సంఘటనా స్థలానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో అంగా ఎక్స్ ప్రెస్ (భాగల్ పూర్ టు బెంగళూరు) ఆగిపోయింది. ఓ బోగీలో మంటలు వస్తున్నాయని అరుస్తూ పలువురు చైన్ లాగడంతో ఈ ట్రైన్ ఆగిపోయింది. ఆ వెంటనే కొన్ని బోగీల నుంచి ప్రయాణికులు భయంతో బయటికి పరుగులు తీశారని అంటున్నారు. ఇలా హుటాహుటిన రైలు బయటికొచ్చిన జనం పక్కనున్న రైల్వే ట్రాక్‌పై నిలబడి ఉండగా.. సడెన్‌గా ఇంకొక ట్రైన్ వచ్చి ఢీకొట్టిందని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని రైల్వే అధికారులు అంటున్నారు. అంగా ఎక్స్ ప్రెస్ ఆగిన ప్రదేశానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగిందని గుర్తు చేస్తున్నారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు కూడా రైలు ప్రయాణికులు కాదని, సాధారణ బాటసారులని తేల్చి చెబుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన వారిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి చంపై సోరెన్ తదితరులు ఉన్నారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు రైల్వే అధికారులు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.



Next Story

Most Viewed