దేశవ్యాప్త రాస్తా రోకో ఎప్పుడంటే…

by  |
దేశవ్యాప్త రాస్తా రోకో ఎప్పుడంటే…
X

న్యూఢిల్లీ: సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు రైతు ఆందోళనకారులు శనివారం దేశవ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తమ డిమాండ్లను పట్టించుకోలేదని, అందుకు నిరసనగానే ‘చక్కా జామ్’కు పిలుపునిచ్చినట్టు 40 రైతు సంఘాల కూటమి సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. నిరసన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిసింది.

ట్రాక్టర్ పరేడ్ తర్వాత సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించనున్న నిరసన కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. రాస్తా రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఘాజీపూర్ నిరసన ప్రాంతం నుంచి పెద్దమొత్తంలో రైతులు స్వగ్రామాలకు తరలుతున్నారు. అలాగే, గ్రామాల నుంచీ భారీగానే రైతులు ఆందోళన ప్రాంతాలకు వస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా ‘రాస్తా రోకో’కు మోర్చా పిలుపునిచ్చింది. ఢిల్లీలో తాము రాస్తా రోకోలు చేయడం లేదని, స్వయంగానే అక్కడ ఢిల్లీ బంద్ మోడ్‌లో ఉన్నదని రైతు నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. అందుకే ఢిల్లీలో రాస్తా రోకో చేయడం లేదని పేర్కొన్నారు.



Next Story

Most Viewed