జాతీయ లోక్ అదాలత్‌లో 35 వేల వివాదాలు పరిష్కారం

85

దిశ, క్రైమ్ బ్యూరో : లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో రాష్ట్ర వ్యాప్తంగా 35,650 కేసులు పరిష్కరమైనట్టు మెంబర్ కార్యదర్శి జి.అనుపమ చక్రవర్తి తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమ కోహ్లీ సూచనల మేరకు జస్టీస్ ఎమ్మెస్ రాంచంద్ర రావు, జస్జీస్ పి.నవీన్ రావు పర్యవేక్షణలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో లీగల్ సర్వీసెస్ అథారిటీ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా 10,846 కేసులు ప్రీ లిటిగేషన్స్‌తో పాటు కోర్టులో పెండింగ్ లో ఉన్న 24,804 కేసులు పరిష్కారం అయినట్టు చెప్పారు. ఈ కేసుల ద్వారా రూ.49.2 కోట్ల పరిహారం సెటిల్మెంట్ జరిగినట్టు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..