తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు.. కారణమిదే..?

by  |
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు.. కారణమిదే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్జీటీ బెంచ్ మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది వాదిస్తూ సచివాలయం భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరమా? లేదా? అనేది ఎన్జీటీ అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవచ్చన్నారు. గతంలో సుప్రీంకోర్టు సైతం ఒక కేసు విచారణ సందర్భంగా ఇలాంటి ఆదేశాలనే జారీ చేసిందని బెంచ్‌కు వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ.. తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని, పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై సమాధానాన్ని ఇవ్వాలని, కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొనాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా వేసింది.


Next Story