శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతీయ ఇంధన పొదుపు 2021 అవార్డు  

by  |
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతీయ ఇంధన పొదుపు 2021 అవార్డు  
X

దిశ, శంషాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఇంధన పొదుపులో చేసిన కృషికిగాను ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ’ ద్వారా ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2021’ అవార్డును అందుకుంది. డిసెంబరు 14న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీనియర్ అధికారులకు ఈ అవార్డును అందజేశారు.

ఎయిర్‌పోర్ట్ రంగంలో ఈ అవార్డు పొందిన ఏకైక విమానాశ్రయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ సంవత్సరం, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్, నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్నోవేషన్ అవార్డు లను “ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అందజేశారు. ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సీఈఓ ప్రదీప్‌ పణికర్‌ మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న ఇంధన వనరులను సద్వినియోగం చేసుకోవాలనే మా నిబద్ధతను ఈ విశిష్టమైన గుర్తింపు పునరుద్ఘాటిస్తోంది.

ఒక బాధ్యతాయుతమైన కార్పొరేట్‌గా, అత్యుత్తమమైన ఇంధన సంరక్షణ పరిష్కారాలను అన్వేషించడంలో, వాటిని అమలు చేయడంలో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఎప్పుడూ ముందుంటుంది. కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించడానికి మేము అనేక కార్యక్రమాలను ప్రారంభించాము. పర్యావరణ సంక్షోభం పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్ తరాలు పరిశుభ్రమైన, హరిత సాంకేతికత వైపు మళ్లే దిశగా ఈ అవార్డు మాపై మరింత బాధ్యతను పెంచింది అన్నారు.

Next Story

Most Viewed