అదే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత: నారా లోకేశ్

80

దిశ, వెబ్‌డెస్క్: నిందితులను గాలికొదిలేసి సమాచారం ఇచ్చిన వ్యక్తులను, వార్త రాసిన జర్నలిస్టులను వేధించడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం.. సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ముఖ ద్వారం పై ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసమైన వార్త రాసినందుకు జర్నలిస్టుల పై అక్రమ కేసులు పెట్టి వేధించడమే..
వైఎస్ జగన్ మూర్ఖత్వానికి పరాకాష్ట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 140 ఘటనలు జరిగితే నిందితులను పట్టుకోలేని ప్రభుత్వం పోలీసుల పై ఒత్తిడి తెచ్చి సమాచారం బయటపెట్టిన వ్యక్తులు, జర్నలిస్టుల పై అక్రమాలు బనాయిస్తుందన్నారు. వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అమాయకుల పై కేసులు పెడుతున్న కొంతమంది పోలీసులు పర్యవసానం అనుభవించక తప్పదని ఆయన హెచ్చరించారు. ముందే విగ్రహాలు విరిగిపోయాయని మాయచేస్తున్న ప్రభుత్వం మరమ్మత్తులు ఎందుకు చెయ్యలేదని నిలదీశారు. వాస్తవాలు బయటకొచ్చాకా ఎదో తప్పుడు కథలు చెప్పడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందంటూ టీడీపీ లీడర్ నారా లోకేశ్ ఆరోపించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..