రేపు తిరుపతిలో నారా భువనేశ్వరి పర్యటన.. వారికి సాయం

by  |
రేపు తిరుపతిలో నారా భువనేశ్వరి పర్యటన.. వారికి సాయం
X

దిశ, ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా అతలాకుతలమైంది. ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించిన విష‌యం తెలిసిందే. దీంతో వరద బాధితులకు సాయం అందించేందుకు భువనేశ్వరి రేపు తిరుపతిలో పర్యటించాల‌ని నిర్ణ‌యించారు. మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరఫున చంద్రబాబు ప్రకటించినట్లు రూ.లక్ష చొప్పున‌ ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. మొత్తం 48 మంది కుటుంబాలకు భువనేశ్వరి ఆర్థికసాయం అందజేయనున్నారు.

ఇకపోతే వరదల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు వరద సహాయక చర్యల్లో పాల్గొని సేవలు అందించారు. మూడు జిల్లాలోని వరద ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసరాలు అందించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ వివాదం నెల‌కొన్న సంగతి తెలిసిందే. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు కన్నీటి పర్యంతమవ్వడం.. ఈ అంశంపై భువనేశ్వరి కూడా స్పందించారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానం మరే మహిళకు జరగకూడదంటూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిదే. ఈ ఘటనను ఇప్పటికీ ప్రజలు మరచిపోలేదు. ఇలాంటి తరుణంలో తిరుపతిలో భువనేశ్వరి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.



Next Story

Most Viewed