జాతీయ క్రీడల్లో నందిని సలోఖేకు స్వర్ణ పతకం

by  |
జాతీయ క్రీడల్లో నందిని సలోఖేకు స్వర్ణ పతకం
X

దిశ, స్పోర్ట్స్ : ఆగ్రాలో జరుగుతున్న జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన నందిని సోలంఖే 53 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీకి చెందిన మమత రాణితో తలపడి 4-0 రౌండ్ల తేడాతో విజయం సాధించింది. ఇండియా అగ్రశ్రేణి రెజ్లర్ వినేష్ ఫొగట్‌కు వారసురాలిగా నందినిని అందరూ కొనియాడుతున్నారు. చిన్నతనంలో కబడ్డీ ఆడిన నందిని ఏడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. తండ్రి చనిపోయిన తర్వాత నందిని సంరక్షణ బాధ్యతలు అన్నీ తల్లే చూసుకుంది. అయితే ఏనాడూ నందినిలో ఆటపట్ల ఉన్న ఆసక్తిని నిరుత్సాహపర్చలేదు. రెజ్లింగ్ గురించి ఎప్పుడూ వినని నందిని.. 2010లో తన గ్రామంలో స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో జరిగిన సెలెక్షన్స్‌లో రెజ్లింగ్ వైపు మళ్లింది. ఆమె కోచ్ దాదా లావాతే కూడా నందినిలో రెజ్లింగ్ ఆడే ప్రతిభ ఉన్నదని గ్రహించి ప్రోత్సహించాడు. తల్లి మొదటి రెజ్లింగ్ అంటే ఒప్పుకోకపోయినా తర్వాత కూతురు కోరికను మన్నించింది. అలా పది ఏళ్లలోనే జాతీయ చాంపియన్‌గా అవతరించింది. హర్యానా నుంచి కాకుండా తొలి సారి వేరే రాష్ట్రానికి చెందిన రెజ్లర్ జాతీయ స్వర్ణ పతకం గెలవడం ఇదే తొలిసారి.

Next Story

Most Viewed