నభ కోలీవుడ్ ఎంట్రీ..?

52

దిశ, వెబ్‌డెస్క్: ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేశ్ తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారింది. గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకుంటున్న భామ బిజీ బిజీ అవుతోంది. ఇప్పటికే ‘సోలో బ్రతుకే సో బెటర్’లో పర్ఫార్మెన్స్‌తో కాంప్లిమెంట్స్ అందుకున్న నభ.. జనవరి 14న వస్తున్న ‘అల్లుడు అదుర్స్‌’లో ఫిమేల్ లీడ్‌గా అదరగొట్టేందుకు సిద్ధంగా ఉంది. మొత్తానికి ఈ సంక్రాంతికి తెలుగులో హవా చూపిస్తున్న భామ.. త్వరలో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్. చియాన్ విక్రమ్, డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాతో తమిళ్‌లోఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతుందని తెలుస్తోంది. అంతేకాదు స్టార్ హీరోలు జయం రవి, విశాల్‌ సినిమాల్లోనూ హీరోయిన్‌గా ఆఫర్ కొట్టేసిందని సమాచారం. ఇక మరో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్.. కోలీవుడ్‌లో ఈ సంక్రాంతికి ‘భూమి’, ‘ఈశ్వరన్’ సినిమాలతో ఆకట్టుకోనుండగా.. నభ కూడా తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు సన్నద్ధం అవుతోంది.