ముత్తూట్ ఫైనాన్స్ లాభాలు రూ. 996 కోట్లు!

by  |
ముత్తూట్ ఫైనాన్స్ లాభాలు రూ. 996 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద బంగారు రుణల సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర లాభాలు రూ. 3,722 కోట్లుగా వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 3,018 కోట్లతో పోలిస్తే ఇది 23 శాతం పెరిగినట్టు సంస్థ తెలిపింది. కంపెనీ రుణాల ఆస్తులు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 52,622 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 26 శాతం పెరిగినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇక, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో ముత్తూట్ ఫైనాన్స్ రూ. 995.6 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 815.1 కోట్లతో పోలిస్తే 22.1 శాతం వృద్ధి సాధించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ నికర వడ్డీ ఆదాయం రూ. 1,829.5 కోట్లుగా తెలిపింది.

2020, మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 15.7 శాతం పెరిగింది. ‘ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ ఐపీఓ ద్వారా ఈక్విటీ షేర్లను స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ చేసి 10 ఏళ్లు గడిచిందని, ఈ దశాబ్ద కాలంలో సంస్థ అనేక మైలురాళ్లను దాటిందని’ ముత్తూట్ ఫైనాన్స్ ఛైర్మన్ జార్జ్ జాకబ్ ముత్తూట్ చెప్పారు. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ బోర్డు ఒక్కో షేర్‌కు రూ. 20 డివిడెండ్‌కు ఆమోదం తెలిపింది. ముత్తూట్ ఫైనాన్స్ అన్నుబంధన సంస్థ అయిన ముత్తూట్ హోమ్‌ఫిన్ లిమిటెడ్ సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో రూ. 13 కోట్ల లాభాలను వెల్లడించింది. బుధవారం కంపెనీ త్రైమాసిక ఆదాయల వెల్లడి నేపథ్యంలో కంపెనీ షేర్ ధర 7.73 శాతం పెరిగి రూ. 1,410కి చేరుకుంది.

Next Story

Most Viewed