మానవత్వం పరిమళించిన వేళ.. కరోనాతో మృతి చెందిన హిందూ వ్యక్తికి..

by  |
మానవత్వం పరిమళించిన వేళ.. కరోనాతో మృతి చెందిన హిందూ వ్యక్తికి..
X

దిశ, న‌ర్సాపూర్: క‌రోనా క‌ష్ట‌కాలంలో మాన‌వ సంబంధాలు దెబ్బ‌తింటున్నాయి. మాన‌వ‌త్వం మంట క‌లుస్తుంది. మ‌ర‌ణించిన వ్య‌క్తి అంత్య‌క్రియ‌లు చేయ‌డానికి గ్రాయ‌స్తులు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో ముస్లీం యువ‌కులు ముందుకు వ‌చ్చి అంత్య‌క్రియ‌లు చేసిన సంఘ‌ట‌న న‌ర్సాపూర్ మండ‌లం గూడెంగ‌డ్డ గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామ‌స్తులు,కుటుంబీకులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ్రామానికి చెందిన బొందిల నంద‌కుమార్ (50) గ‌త కొంత‌కాలం క్రితం అనారోగ్యానికి గుర‌య్యాడు. ఇటివ‌లే ఆయ‌న‌కు క‌రోనా సోకింది. సోమ‌వారం నంద‌కుమార్ ఇంట్లోనే మ‌ర‌ణించాడు. అయితే గ్రామంలో అంత్య‌క్రియ‌లు చేయ‌డానికి ఎవ‌రూ మందుకు రాక‌పోవ‌డంతో విష‌యం తెలుసుకున్న న‌ర్సాపూర్ ప‌ట్ట‌ణానికి చెందిన ముస్లీంలు ముందుకు వ‌చ్చి హిందు సాంప్ర‌దాయం ప్ర‌కారం అంత్య‌క్రియ‌లు చేశారు. నంద‌కుమార్‌కు భార్య‌తో పాటు ఇద్ద‌రు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.



Next Story

Most Viewed