ఏపీలో ముగిసిన పోలింగ్.. 60శాతం పోలింగ్ నమోదు

by  |
ap elections
X

దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బుధవారం జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పోరేషన్లతో పాటు 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో పలు చోట్ల భారీ పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న వారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

4 మున్సిపాలిటీలు ఏకగ్రీవం:

రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లతో పాటు 75 మున్సిపాలిటీలకు ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 71 మున్సిపాలిటీలకే ఎన్నికలు జరిగాయి. ఉదయం పలు చోట్ల పోలింగ్ మందకొడిగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నానికి ఊపందుకుంది. అయితే ఎస్ఈఈసీ దృష్టి పెట్టిన విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి కార్పోరేషన్లలో పోలింగ్‌ శాతాలు ఓ మోస్తరుగా మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చెదురు మదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్ధులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలింగ్‌ బూత్‌ ల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని ఘర్షణలు నివారించడంతో పోలీంగ్ దాదాపుగా ప్రశాంతంగా పూర్తైంది.

ఇకపోతే ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థల్లోని 581 డివిజన్లు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లోని 1,633 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2,213 డివిజన్లు/వార్డుల్లో కలిపి 77,73,231 మంది ఓటర్లున్నారు. 2,123 వార్డులకు 490 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 7,915 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరిలో పురుష ఓటర్లు 38,25,129 మంది కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 39,46,952. ట్రాన్స్‌జెండర్లు 1150 మంది ఉన్నారు. మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2,320 అత్యంత సమస్యాత్మక, 2,468 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed